ప్రముఖ కోలీవుడ్ టాప్ డైరెక్టర్గా పేరు సంపాదించిన నెల్సన్ దిలీప్ కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ భారీ మల్టీ స్టారర్ ను డైరెక్టర్ నెల్సన్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని విషయాలను డైరెక్టర్ నెల్సన్ ఫైనలైజ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ కథను కూడా ఇద్దరు హీరోలకు వినిపించారని , ఇద్దరికీ కూడా కథ నచ్చడంతో పాజిటివ్ గానే స్పందించారని సమాచారం.
RRR సినిమా తర్వాత మళ్లీ ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ నెల్సన్ వేసిన ప్లాన్ ఒకవేళ నిజమైతే మాత్రం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఏ మేరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్, దేవర 2 వంటి చిత్రాలతో బిజీగా ఉండగా రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి