టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు , సూర్య దేవర నాగ వంశీ ముందు వరుసలో ఉంటారు. వీరు ఇద్దరు కూడా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి అందులో అనేక మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ నిర్మాతలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే 2025 వ సంవత్సరం ఈ ఇద్దరు నిర్మాతలకు పెద్దగా కలిసి రాలేదు. 2025 వ సంవత్సరం ప్రారంభం లోనే దిల్ రాజు నిర్మించిన గేమ్ చెంజర్ సినిమా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా దిల్ రాజు కు పెద్ద ఎత్తున లాభాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈయన నిర్మించిన తమ్ముడు సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే 2026 వ సంవత్సరం దిల్ రాజు బ్యానర్ నుండి చాలా సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.

మరి ఆ సినిమాలతో ఈయన మంచి విజయాలను అందుకొని మళ్లీ నిర్మాతగా ఫుల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. గత కొన్ని సంవత్సరాలుగా నాగ వంశీ బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. కానీ 2025 వ సంవత్సరం ఈ నిర్మాతకు కూడా పెద్దగా కలిసి రాలేదు. ఈయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు భారీ స్థాయి విజయాలను ఎక్కువగా అందుకోలేదు. ఇకపోతే ఈయన కూడా వచ్చే సంవత్సరం భారీ విజయాలను అందుకుంటాను అని తాజాగా సినిమా ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. మరి ఈ ఇద్దరు స్టార్ నిర్మాతలు 2026 వ సంవత్సరం పై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి వీరు వచ్చే సంవత్సరం ఏ స్థాయి విజయాలను అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: