'వారణాసి'లో పృథ్వీరాజ్ 'కుంభా' రూపం:
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' కోసం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను విలన్‌గా ఎంపిక చేయడం సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమాలో ఆయన “కుంభా” అనే పాత్రలో కనిపించబోతున్నారు. పైకి వికలాంగుడిలా కనిపించే ఈ పాత్ర, లోపల మాత్రం రాక్షసుడితో నిండి ఉంటుందట. తెరపై ఆయన చూపించే భయం, నటన సినిమాకు అతిపెద్ద ప్లస్ అవుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ సినిమాలో టోవినో థామస్!
'సలార్'తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తన తదుపరి చిత్రం అయిన ఎన్టీఆర్ మూవీలో విలన్‌గా మరో మలయాళ హీరో టోవినో థామస్‌ను తీసుకోబోతున్నారనే వార్త భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ మాస్ కాంబినేషన్ ఖాయమనే బజ్ గట్టిగా వినిపిస్తోంది.
'పుష్ప' ఫహద్, 'సైకో' శైన్ టామ్ చాకో!
మాలీవుడ్ విలన్ల ట్రెండ్‌కు నాంది పలికింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రమే. ఫహద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర, తెలుగు విలన్లకు ఒక కొత్త డైమెన్షన్‌ను పరిచయం చేసింది.'పుష్ప 2'లో ఆయన పాత్ర మరింత భయానకంగా ఉండబోతోందని క్రిటిక్స్ చెబుతున్నారు.
మరోవైపు, మలయాళ నటుడు శైన్ టామ్ చాకో అయితే టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో కనిపిస్తూ బిజీ అయిపోయారు. నాని 'దసరా', ఎన్టీఆర్ 'దేవర', బాలయ్య 'డాకు మహారాజ్', నితిన్ 'రాబిన్ హుడ్' వంటి ప్రతి సినిమాలో వేరువేరు షేడ్స్‌తో విలన్ పాత్రలకి కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
మొత్తం మీద, మాలీవుడ్ విలన్ల ఎంట్రీతో తెలుగు సినిమాల్లో కొత్త స్టైల్, కొత్త టెర్రర్, కొత్త మాస్ డోస్ చేరి, మన స్టార్ హీరోలకు దీటైన పోటీ ఇచ్చే 'సైకో విలన్ల' సంఖ్య పెరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి