టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ బ్యానర్లలో మైత్రి మూవీ సంస్థ ఒకటి. ఈ బ్యానర్ నుండి వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ముఖ్యంగా ఈ బ్యానర్ వారు స్టార్ హీరోలతో నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక ఈ బ్యానర్ వారు మీడియం రేంజ్ హీరోలతో నిర్మించిన సినిమాలతో మాత్రం భారీ అపజయాలను అనేక సార్లు అందుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బ్యానర్ వారు నాని హీరో గా రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమాను నిర్మించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. అలాగే నాని హీరో గా రూపొందిన అంటే సుందరానికి సినిమాను కూడా ఈ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన డియర్ కామ్రేడ్ , ఖుషి సినిమాలను కూడా ఈ బ్యానర్ వారు నిర్మించారు.

ఈ రెండు సినిమాలు కూడా పెద్ద స్థాయి విజయాలను సొంతం చేసుకోలేదు. ఇకపోతే నాగ చైతన్య హీరో గా రూపొందిన సవ్యసాచి మూవీ ని కూడా ఈ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. కొంత కాలం క్రితం నితిన్ హీరో గా రూపొందిన రాబిన్ హుడ్ అనే సినిమాను ఈ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే తాజాగా ఈ బ్యానర్ వారు ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్లను ప్రస్తుతం వసూలు చేయలేక పోతుంది. మరి ఈ సినిమాతో మైత్రి సంస్థకు ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: