ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్, హెలికాప్టర్ షూట్ జరగనుందని వార్తలు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో క్లారిటీ ఇచ్చారు. "అది యాక్షన్ సీక్వెన్స్ కాదు... ఫన్ ఫైట్! హెలికాప్టర్లు ఉన్నాయి నిజమే. కానీ అది మెగా బ్లాస్టింగ్ ఫైట్ కాదు. ఆ సన్నివేశాలను థియేటర్‌లో చూసి ఆడియన్స్ ఫన్ ఎంజాయ్ చేయాలి" అని అనిల్ స్పష్టం చేశారు. ఆయన మాటల ప్రకారం, ఈ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు అంతులేని వినోదాన్ని అందిస్తుందని అర్థమవుతోంది.ఇదే కాకుండా, అనిల్ రావిపూడి ఒక హాట్ హైలైట్ కూడా షేర్ చేశారు. ఈ సినిమాలో ఇంకా నాలుగు పాటలు ఉన్నాయని, వాటిలో ఒక స్పెషల్ సాంగ్ చిరంజీవి-నాగార్జున కాంబినేషన్‌లో ఉండబోతుందని ప్రకటించారు. ఈ మెగా-కింగ్ కాంబినేషన్ తెలుగు సినీ అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్‌గా మారింది.
"చిరంజీవి గారు ఈ తరహా న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రలో దాదాపు 25 ఏళ్లుగా కనిపించలేదు. ఇది కొత్త తరం పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది" అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ విధంగా, స్టార్ హీరోలు, ఫ్యామిలీ ఎమోషన్, పక్కా కామెడీ, మరియు సరదా ఫైట్‌తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి