ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) చిత్రం కోసం అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా యాక్షన్ సీన్స్ షూటింగ్ డిసెంబర్‌లో మూడో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ప్రశాంత్ నీల్ స్టైల్ లో వచ్చే రగ్డ్ యాక్షన్, ఎన్టీఆర్ ఎనర్జీ – ఈ రెండూ కలిసి తెరపై ఒక వినూత్న అనుభూతిని ఇవ్వబోతున్నాయనే హైప్ నెలకొంది.ఈ సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలు ఎన్టీఆర్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా, అత్యంత ప్రమాదకరంగా ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ హై-ఇంటెన్స్ స్టంట్స్ కోసం ఎలాంటి డూప్ లను ఉపయోగించకూడదని ఎన్టీఆర్ ముందుగానే నిర్ణయించుకున్నారని సమాచారం. హాలీవుడ్ టాప్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ లా, ప్రతి ప్రమాదకర యాక్షన్ సీక్వెన్స్‌ను స్వయంగా తానే చేయాలని తారక్ ఫిక్స్ అయ్యారట.


ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్టూడియోలో భారీ ఎత్తున ప్రత్యేక సెట్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపు మూడు వారాల పాటు రాత్రి వేళల్లో కొనసాగనున్న ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం టెక్నికల్ టీమ్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు, సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్—అందరినీ పెద్ద ఎత్తున మోహరించారని తెలుస్తోంది. ఇండియన్ యాక్షన్ స్టాండర్డ్స్‌ను మించి, హాలీవుడ్ లెవెల్‌లో యాక్షన్ డిజైన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే దీని గురించి వార్తలు వెల్లువెత్తుతున్నాయి.



సినిమా కోసం ఎన్టీఆర్ చేయబోయే స్టంట్స్ ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రమాదకరమైనవని, ఇంత రిస్కీ యాక్షన్ తారక్ ఇంతకుముందెప్పుడూ చేయలేదని. తారక్ మాత్రం “తగ్గేదేలే” అన్నట్టుగా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని టాక్.
అయితే, ఈ మొత్తం విషయంలో మరో ఆసక్తికరమైన, అలాగే కాస్త ఆందోళన కలిగించే అంశం కూడా వినిపిస్తోంది. అది ఏంటి అంటే—ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చేయబోయే స్టంట్స్ ఎంత ప్రమాదకరమైనవో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదట. ఇంట్లో వాళ్లు అనవసరంగా టెన్షన్ పడతారని, షూటింగ్ గురించి ఆందోళన చెందుతారని భావించి, ఈ విషయాన్ని పూర్తిగా దాచిపెట్టారట. తమ బాధలను పెంచకూడదన్న ఆలోచనతోనే ఈ రిస్క్ లెవెల్‌ను ఇంట్లో చెప్పలేదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'డ్రాగన్' సినిమా ఇండియన్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉందనే బజ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: