హీరోయిన్ సమంత పెళ్లి చేసుకోవడంతో ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత రాజ్ తో కలిసి మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. ముఖ్యంగా సమంత కట్టుబొట్టు ఎంతో అద్భుతంగా అనిపించింది.మొదటి పెళ్లి సమయంలోనే సమంత చాలా క్యూట్ గా ఉంది అంటే రెండో పెళ్లి చేసుకునే సమయంలో కూడా సమంత అదే అందాన్ని మెయింటైన్ చేసి ఎరుపు రంగు చీరలో కొప్పున పువ్వులు పెట్టి ఎంతో అద్భుతంగా కనిపించింది. చేతులకు బంగారు గాజులు, మెహందీ, మెడలో చౌకర్స్,పెద్ద చెవి కమ్మలు ఇలా ప్రతి ఒక్కటి సమంత రెండో పెళ్లిళ్లు ఆకర్షణీయంగా నిలిచాయి. 

అయితే వీటన్నింటికంటే ఎక్కువగా వైరల్ అయింది సమంత చేతికి ఉన్న వెడ్డింగ్ రింగ్..సమంత చేతికి డైమండ్ వెడ్డింగ్ రింగ్  నీ రాజ్ పెట్టారు.అయితే ఈ వెడ్డింగ్ రింగ్ అన్ని ఉంగరాలలా కాకుండా కాస్త స్పెషల్ గా వెరైటీగా ఉంది. ఈ వెడ్డింగ్ రింగులోని 4 మూలలకు నాలుగు అర్ధాలు ఉన్నాయట.మరి ఆ వెడ్డింగ్ రింగ్ లో ఉన్న అంత స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమంత వెడ్డింగ్ రింగ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత వెడ్డింగ్ రింగ్ గురించి మాట్లాడుతూ.. సమంత పెళ్లికి పెట్టుకున్న ఆ ఉంగరం మొఘల్ కాలం నాటిది. మొఘల్ కాలంలో ఎక్కువగా ఇలాంటి తరహా ఉంగరాలు పెట్టుకునే వారు. మళ్లీ ఇప్పుడు సమత దాన్ని రీ క్రియేట్ చేసింది.

అంతే కాదు సమంత పెట్టుకున్న ఆ పోట్రైట్ కట్ ఉంగరంలో  స్వచ్ఛమైన స్వభావం,బలం, తేజస్సు వంటి వాటికి చిహ్నం. ఇలాంటి తరహా ఉంగరాలు మొఘల్ ల కాలంలో మొదటిసారి తయారు చేశారు. డైమండ్ ని ఒక ప్రత్యేక విధానంలో కట్ చేసి పల్చని గాజు పలకలాగా తయారుచేస్తారు. ఇలాంటి ఉంగరాలు చాలా అరదుగా ఉంటాయి. మళ్ళీ ఈ ఉంగరాన్ని సమంత తన పెళ్లిలో పెట్టుకొని అందర్నీ సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు షాజహాన్ భార్య ముంతాజ్ కి ఇలాంటి ఉంగరాలు అంటే చాలా ఇష్టం అని చరిత్ర చెబుతుంది అంటూ ఆ జువెల్లరీ వ్యాపారి చెప్పుకొచ్చారు.దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారడంతో సమంత తన పెళ్లిలో అంత స్పెషల్ రింగ్ ని ధరించిందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: