సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల వద్ద ఉన్న ధియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. సంక్రాంతి పండక్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి పండక్కు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా ఏది అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తారు. ఇక ఆఖరి ఐదు సంవత్సరాలలో సంక్రాంతి పండక్కు విడుదల అయిన సినిమాలలో సంక్రాంతి విన్నారుగా నిలిచిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

2021 వ సంవత్సరం మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన క్రాక్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు సినిమా 2022వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

తేజ సజ్జ హీరో గా రూపొందిన హనుమాన్ సినిమా 2024 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

విక్టరీ వెంకటేష్ హీరో గా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: