ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని నవంబర్ 27 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ బాక్సా ఫీస్ దగ్గర వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసులు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చాలా మంది భావించారు.

కానీ ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేయలేకపోవడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ విషయంపై స్పందించారు. తాజాగా రామ్సినిమా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... నాకు నవంబర్ నెల అంటే చాలా భయం. అందుకు ప్రధాన కారణం కొన్ని సంవత్సరాల క్రితం నేను , వెంకటేష్ గారు కలిసి మసాలా అనే సినిమాలో నటించాం. ఆ మూవీ కి మంచి టాక్ వచ్చింది. కానీ మేము ఒంటరిగా నటించిన ముందు సినిమాల రేంజ్ ఓపెనింగ్స్ కూడా ఆ సినిమాకు రాలేదు. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను కూడా నవంబర్ నెలలో విడుదల చేస్తాము అంటే భయ మేసింది. కానీ ఆ సమయంలో మేము అనుకున్నది మొదటి వారంలో పెద్దగా కలెక్షన్స్ రావు. ఆ తర్వాత రెండవ వారం నుండి ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతాయి అని మేము భావించాము. ఇక మొదటి వారం ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. రెండవ వారం నుండి ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తాయి అని మేము భావిస్తున్నాము అని రామ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: