ఫ్యాషన్ డిజైనర్‌ శిల్పా రెడ్డి గురించి అందరికి తెలుసు. సమంత జాన్ జిగి ఫ్రెండ్. ఆమె సమంత0రాజ్ నిడిమోరు వివాహం గురించి ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. సమంత – రాజ్‌ పెళ్లి సందర్భంగా తాను అనుభవించిన భావోద్వేగాలను, ఆ వేడుకలో చూసిన ప్రత్యేక క్షణాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడారు. ముఖ్యంగా భూత శుద్ధి కార్యక్రమంలో చోటుచేసుకున్న ఒక సంఘటన చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ భావోద్వేగంతో వెల్లడించారు.తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శిల్పా రెడ్డి, సమంతరాజ్ వివాహం గురించి, అలాగే సమంతతో తన బంధం గురించి కూడా హృదయపూర్వకంగా మాట్లాడారు.


“సమంత–రాజ్ ఇద్దరూ పూర్తిగా భిన్న స్వభావాలవారు. రాజ్ చాలా నిశ్శబ్దంగా, కోల్డ్ మరియు సైలెంట్‌గా ఉంటారు. కానీ సమంత మాత్రం ఎనర్జీతో నిండిన చిలిపి స్వభావం కలిగినది. ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒక్కటిగా కలిసినప్పుడు ఏర్పడే ఆ పవిత్ర బంధం చూడటమే ఒక అనుభూతి, అందుకే వాళ్లు పెళ్లి చేసుకున్నారు ఏమో” అని అన్నారు.  అలాగే ప్రసిద్ధ గాయని శోభరాజు రాజ్‌కు బంధువు అని తాను ఇటీవలే తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. “సమంత–రాజ్‌ల పెళ్లిలాంటి వేడుకను నేను ఇంతకుముందెప్పుడూ చూడలేదు. అది చాలా సన్నిహితంగా, ఎంతో పవిత్రతతో సాగింది. ప్రతి కుటుంబం తరఫున కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారు. సమంత, రాజ్ ఇద్దరికీ నిజంగా దగ్గరైన వ్యక్తులే ఆ వేడుకలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుండి దర్శకురాలు నందిని రెడ్డి మాత్రమే హాజరయ్యారు. మొత్తం పెళ్లి ప్రక్రియ చాలా సింపుల్‌గా, ఎంతో అర్థవంతంగా జరిగింది,” అంటూ వివరణ ఇచ్చారు.



పెళ్లి సమయంలో జరిగిన ఒక క్షణాన్ని గుర్తుచేసుకుంటూ శిల్పా రెడ్డి ..“అగ్ని ముందు పెళ్లి సూత్రాన్ని వధువు వేలికి, వరుడు వేలికి తగిలించే ఆ పవిత్ర క్షణం ప్రతీ ఒక్కరిలోనూ ఒక వింత అనుభూతిని రేకెత్తించింది. వారి మధ్య ఏదో దైవిక శక్తి వెలువడినట్టు అనిపించింది. అక్కడ ఉన్న అతిథులందరికీ ఆ వేడుక ఒక ఆధ్యాత్మిక అనుభవం లాంటిది,” అని చెప్పారు.



తర్వాత సమంతతో తన అనుబంధం గురించి చెబుతూ, “మేం ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరిపై ఒకరం నవ్వులు, జోక్స్ వేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఒకరినొకరం ఏడిపించుకునేంత ఎమోషనల్ క్షణాలు కూడా ఉంటాయి. నాకు ఏ విషయం లోనైనా తప్పు ఉంటే సమంత వెంటనే సరదాగా, ప్రేమగా ర్యాగింగ్ చేస్తుంది. ” అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: