ఏంటి ఈ ప్రముఖ జర్నలిస్టు అజిత్ తో ఇంటర్వ్యూ చేసి అవమానంగా ఫీల్ అయిందా..అంత అవమానంగా ఫీల్ అవ్వడానికి అజిత్ ఏమైనా తప్పుగా బిహేవ్ చేశారా? ఎందుకు ఆ జర్నలిస్టు సిగ్గుగా అవమానంగా ఫీల్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రముఖ లేడి జర్నలిస్టు అనుపమ చోప్రా అంటే కోలీవుడ్ సెలబ్రిటీలకు సుపరిచితమే. అయితే అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా విడుదల సమయంలో జర్నలిస్టు అనుపమ చోప్రా అజిత్ ని ఇంటర్వ్యూ చేసిందట. అయితే అలా ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుపమా చోప్రా కాస్త అవమానంగా ఫీల్ అయిందట. దానికి కారణం ఏంటో కూడా బయట పెట్టింది.

అజిత్ ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన సింగిల్ గా వచ్చారు. ఆయనతో ఎవరూ కూడా రాలేదు.కానీ నా పక్కన మాత్రం మేకప్ మెన్ ఉన్నారు. అంత పెద్ద హీరో పక్కన మేకప్ మెన్ లేరు ఎవరూ లేరు. అలాంటిది నేను మేకప్  మెన్ ని తీసుకువెళ్లడం నాకే అవమానంగా అనిపించింది. సిగ్గుగా అనిపించింది. అంత పెద్ద స్టార్ హీరో ఎలాంటి ఆడంబరాలకు పోకుండా వస్తే నేను మాత్రం ఇలా మేకప్ మేన్ తో వచ్చానే అని అవమానంగా ఫీల్ అయ్యాను.

అంత పెద్ద స్టార్ సాధారణంగా ఉంటే నేను మాత్రం మేకప్ మెన్ ని వెంటబెట్టుకొని వచ్చి కాస్త ఎక్కువ చేశానేమో అనిపించింది అంటూ అనుపమ చోప్రా దుబాయ్ లో అజిత్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు తన అభిప్రాయం ఏంటో బయటపెట్టింది. అలాగే అజిత్ ఆ ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ లో ఏం కోల్పోయానో, అభిమానుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అలాగే దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే కార్ రేసింగ్ ని ఇలాగే కొనసాగిస్తానని కూడా తెలిపారు అంటూ అనుపమ చోప్రా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: