టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన శ్రీనువైట్ల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను నవ్వించడంలో, మెప్పించడంలో శ్రీనువైట్ల తనదైన ముద్ర వేశారు. 'ఆనందం', 'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'బాద్ షా' వంటి విజయవంతమైన చిత్రాలతో ఆయన టాలీవుడ్‌లో కామెడీకి ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. అయితే గడిచిన దశాబ్ద కాలంలో మాత్రం ఆయనకు సరైన విజయం దక్కలేదు. వరుస ఫ్లాపుల కారణంగా ఆయన కెరీర్ ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర శ్రీనువైట్ల తదుపరి సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనువైట్ల రాబోయే చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీనువైట్ల కొత్త సినిమా స్క్రిప్ట్‌ను తాను విన్నానని, ఇది హిలేరియస్ సబ్జెక్ట్ అని నిర్మాత వెల్లడించారు. గతంలో శ్రీనువైట్ల సినిమాల్లో కనిపించిన వినోదం, హాస్యం ఈ కథలో పుష్కలంగా ఉన్నాయని, ముఖ్యంగా క్లాసిక్ కామెడీ టైమింగ్ మళ్లీ తెరపై కనిపిస్తుందని అనిల్ సుంకర పేర్కొన్నారు. ఈ సబ్జెక్ట్ ప్రేక్షకులకు అంచనాలను మించి నవ్విస్తుందని, విజయం సాధిస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.

శ్రీనువైట్ల కెరీర్‌ను మలుపు తిప్పే అవకాశం ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు అంచనాలను అందుకుంటుందో, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. శ్రీనువైట్ల కామెడీ టైమింగ్, టేకింగ్‌కు అనిల్ సుంకర భరోసా తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. ఆయన గత చిత్రాల విజయాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త కథతో శ్రీనువైట్ల మళ్లీ పూర్వవైభవాన్ని అందుకుని 'హిట్ డైరెక్టర్'గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటారని అభిమానులు, సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. శ్రీనువైట్ల బాక్సాఫీస్ ను షేక్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం

మరింత సమాచారం తెలుసుకోండి: