ఈమధ్య హీరో, హీరోయిన్స్ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మక్కువ చూపుతున్నారు. అలాంటివారిలో హీరోయిన్ హెగ్బా పటేల్ కూడా ఒకరు. 2014లో ఈ ముద్దుగుమ్మ అలాఎలా అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కుమారి 21ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన హెబ్బా పటేల్ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తనకి పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. అలా ఎన్నో చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. 2022లో వచ్చిన ఓదెలా సినిమాతో మరొకసారి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.


ఆ తర్వాత ఓదెల 2 సినిమాతో కూడా మరింత క్రేజ్ సంపాదించుకున్న హెబ్బా పటేల్ తాజాగా ఈషా అనే ఒక హర్రర్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రావడంతో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? లేవా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్లో కొన్ని సన్నివేశాలు కూడా చాలా క్రూరంగా ఉండడమే కాకుండా హర్రర్, థ్రిల్లర్ తోనే భయపెట్టేలా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే ఇందులో  ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నారు.


ఇటీవలే విడుదలే మంచి విజయాన్ని అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ రాజ్,  హెబ్బా పటేల్, సిరి హనుమంత్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాసుమన్నే దర్శకత్వం వహించగా, HVR ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హెబ్బా పటేల్ మరొకసారి సక్సెస్ కొట్టేలా కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రైలర్ అయితే వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: