స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ (Vaud) కౌన్సిల్ ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌తో భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ బయట, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైన 'స్విస్ మాల్'ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి స్విస్ ప్రతినిధులు తక్షణమే సానుకూలంగా స్పందించారు.ఈ మాల్ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఫిబ్రవరిలో స్విస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌కు రానుంది.
ఈ మాల్ ఒక షాపింగ్ సెంటర్ లాగా మాత్రమే కాకుండా, మల్టీ-ఫంక్షనల్ హబ్‌గా ఉండబోతోంది.ప్రపంచ ప్రఖ్యాత స్విస్ వాచీలు, చాక్లెట్లు మరియు ఇతర లగ్జరీ ఉత్పత్తులకు ఇది కేరాఫ్ అడ్రస్ కానుంది. స్విట్జర్లాండ్ తరహా హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా ఇందులో భాగం చేయనున్నారు. స్విస్ ఆహార పదార్థాలు, క్రీడలు (ముఖ్యంగా ఫుట్‌బాల్) మరియు పర్యాటక రంగాలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలు ఇందులో ఉంటాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ షోరూమ్‌లను లేదా నాలెడ్జ్ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్న 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును చూస్తున్నారు. హైదరాబాద్‌ను ఒక గ్లోబల్ రిటైల్ హబ్‌గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం."హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, ఐటీ మాత్రమే కాదు.. ఇప్పుడు గ్లోబల్ లగ్జరీ డెస్టినేషన్ కూడా" అని చాటిచెప్పేలా ఈ స్విస్ మాల్ ఉండబోతోంది
కేవలం వ్యాపారమే కాకుండా, తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా గ్రూపులకు స్విస్ టెక్నాలజీ మరియు మార్కెటింగ్‌లో సహకారం అందించడానికి కూడా స్విస్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్విస్ మాల్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది.ముంబై, బెంగళూరు వంటి నగరాలను కాదని, స్విట్జర్లాండ్ తన తొలి విదేశీ మాల్ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం మన నగర స్టామినాను నిరూపిస్తోంది. ఈ మాల్ గనుక పూర్తయితే, భాగ్యనగరం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో హెడ్ లైన్స్‌లో నిలవడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి