దీనిపై విచారణ చేయాలని.. అవసరమైతే.. తాను సీఎం చంద్రబాబును కూడా కలుస్తానని బోసు చెప్పుకొ చ్చారు. అయితే.. వాస్తవానికి ఎప్పుడో వైసీపీ హయాంలో జరిగితే.. ఇప్పుడు బోసు ఆవేదన వ్యక్తం చేయడం ఏంటనేదే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఆ నాడే చాలా మంది అవినీతిపై జగన్ దృస్టికి తీసుకువె ళ్లారు. దీంతో జగనన్న కాలనీల విషయంలో పక్కా ఆడిట్ కూడా నిర్వహించారు. కానీ, అప్పట్లో బోసు మౌనంగాఉన్నారు.
ఇప్పుడు పార్టీకష్టంలో ఉన్న సమయంలో అనూహ్యంగా ఆయన పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అవినీతి ఆరోపణలుచేయడం.. సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పడం.. ఫక్తు రాజకీయ వ్యూహంగా వైసీపీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు.. తన పదవి కాలం కూడా.. ఈ ఏడాది జూన్‌తో ముగియనుం ది. ఈ నేపథ్యంలో బోసు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అనేది కూడా చర్చకు దారి తీస్తోంది. ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటకు రావాలని భావిస్తున్నారా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
నిజంగానే తప్పులు జరిగి ఉంటే..(జరగలేదని ఎవరూ అనరు) అప్పట్లోనే బోసు బయట పెట్టి ఉంటే.. ఇప్పుడు చేసిన ఆరోపణలే అప్పుడు చేసి ఉంటే.. ఆయన నిజాయితీని అందరూ మెచ్చుకునే వారు. కానీ, పదవీ కాలం మరో ఐదు నెలల్లో ముగుస్తున్న క్రమంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు చేసి.. వైసీపీ పై విమర్శలు చేయడం.. వెనుక ఏదో పొలిటికల్ పాట్లు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏదేమైనా.. బోసు వంటి సీనియర్లు.. ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి