ప్రేక్షకులు కేవలం సినిమా చూడడానికే కాదు, ఒక ఫీల్‌ అనుభవించేందుకు వస్తారని మహేష్ బాబు అభిప్రాయం. అందుకే ప్రతి అంశాన్ని క్లాస్‌తో ప్లాన్ చేసి, అత్యుత్తమంగా అమలు చేశారు. ఆయన బ్రాండ్ అయిన AMB హైద‌రాబాద్‌లో స‌రికొత్త మూవీ ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చింది. హైదరాబాద్‌లో ఇప్పటికే విఖ్యాతి పొందిన AMB Cinemasను విస్తరించి, దేశవ్యాప్తంగా ఒక చైన్ లాగా న‌డిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైద‌రాబాద్‌లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండో మ‌ల్టీఫ్లెక్స్ సంక్రాంతికి మొద‌లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో అడుగు వేసి బెంగళూరు వంటి మల్టీ కల్చరల్, సినిమాకు విపరీతమైన ఆదరణ ఉన్న నగరాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకం అని పరిశీలకులు భావిస్తున్నారు.


ప్రారంభం నుంచే బెంగళూరులోని సినీ ప్రేక్షకుల నుంచి ఈ మల్టీప్లెక్స్‌కు మంచి స్పందన వస్తోంది. "సినిమాను ఇలా లగ్జరీగా చూడటం ఇదే మొదటిసారి" అంటూ పలువురు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ప్రీమియం థియేటర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపై AMB మల్టీప్లెక్స్‌లో ఒక ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించనున్నారు. ఇందులో మొత్తం 9 స్క్రీన్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 16న దీనిని ప్రారంభిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని స్క్రీన్లలో 4K లేజర్ ప్రొజెక్షన్, నాలుగు స్క్రీన్లలో డాల్బీ అట్మాస్ సౌండ్, మిగతా నాలుగు స్క్రీన్లలో Dolby 7.1 సౌండ్తో అల‌రించ‌నున్నాయి. ఇక స్క్రీన్ 1 మరియు 2 ఫ్లాట్ స్క్రీన్లు కాగా డాల్బీ సినిమా స్క్రీన్‌లో డ్యూయల్ 4K Dolby Vision ప్రొజెక్టర్స్ ఉండి Dolby 3D సపోర్ట్, 64 ఛానల్ Atmos సౌండ్ సెటప్ ఈ మ‌ల్టీఫ్లెక్స్ స్పెషాలిటీ అని చెపుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: