స్టార్ హీరో రామ్ చరణ్ ఆస్తుల విలువ దాదాపుగా  1,370 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. తండ్రి నుంచి  వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు  రెమ్యునరేషన్, వ్యాపారాలు ద్వారా  చరణ్ భారీ స్థాయిలో కూడబెట్టారని సమాచారం అందుతోంది.  కొణిదెల ప్రొడక్షన్  బ్యానర్ పై రామ్ చరణ్ పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా విజయాలను అందుకున్నారు.  రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చరణ్ ఇన్వెస్ట్ చేశారని సమాచారం.

రామ్ చరణ్ గ్యారేజ్ లో మెర్సిడెస్, రోల్స్ రాయిస్ ఫాంథమ్, ఫెరారీ, ఆస్టన్ మార్టిన్  లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తోంది.  రామ్ చరణ్ భార్య ఉపాసన ఆస్తుల విలువ కూడా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని  తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మూడు దశాబ్దాలుగా సినిమాల్లో ఉండగా పవన్ ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయలుగా ఉంది. పవన్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. తన సినిమాలు ప్లాప్ రిజల్ట్ ను అందుకున్న సమయంలో నిర్మాతలను ఆదుకున్న హీరోగా కూడా పవన్ కళ్యాణ్ కు పేరుంది.ఈ విషయంలో పవన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరో అల్లు అర్జున్ ఆస్తుల విలువ 500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.  అల్లు అర్జున్ సైతం తన సంపాదనను మల్టిప్లెక్స్ బిజినెస్ లో  ఇన్వెస్ట్ చేశారు.  వివిధ బ్రాండ్‌లకు ప్రచారం చేయడం ద్వారా బన్నీ భారీ స్థాయిలో సంపాదించారని తెలుస్తోంది.  అల్లు అర్జున్ కు కూడా సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది. పుష్ప ది  రూల్ విజయంతో అల్లు అర్జున్ దేశవ్యాప్తమగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.  ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో బన్నీ ఒక సినిమాలో నటిస్తుండగా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  బన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: