స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్  అంటే నందమూరి అభిమానులకు కలిగే సంతోషం అంతాఇంతా కాదు. ఈ  కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు సంచలన విజయం సాధించాయి. అఖండ సైనిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ2 మూవీ ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించిందా? లేదా? ఇప్పుడు  చూద్దాం. ఎన్నో అడ్డంకులు దాటుకుని విడుదలైన అఖండ2  పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.

కథ :

భారతదేశంపై పగతో రగిలిపోతున్న చైనా ఆర్మీ జనరల్ (సంగమ్ షెల్ట్రిమ్)  మాజీ చైనా జనరల్  చాంగ్ (శాశ్వత ఛటర్జీ) ఆధ్వర్యంలో ఒక ఇండియన్ పొలిటీషియన్ సహాయంతో బయో వార్ సృష్టిస్తాడు. మహా కుంభమేళా జరిగే సమయంలో గంగానదిలో ఒక వైరస్ ను ప్రవేశపెడతారు.  అయితే అనంతపురం ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ (బాలకృష్ణ) కూతురు అయిన జనని (హర్షాలీ) ఆ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెడుతుంది.

ఆ వైరస్ ప్రజలకు చేరకుండా  ఇండియన్ పొలిటీషియన్, మాంత్రికుడు విసూచి (ఆది పినిశెట్టి) ప్రయత్నిస్తారు. ఆ సమయంలో జననిని కాపాడటానికి  అఖండ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వ్యాక్సిన్ ప్రజలకు చేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ  సినిమా.

విశ్లేషణ:

బాలయ్య బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే అభిమానులు కచ్చితంగా ఆ సినిమా నుంచి కొన్ని అంశాలను ఆశిస్తారు.  సాధారణంగా  బోయపాటి సినిమాలలో ప్రధానంగా ఒకటి లేదా రెండు అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే పాన్ ఇండియా కోసం లెక్కకు  మించిన పాత్రలు, కథలో ఎక్కువగా ట్విస్టులు ఉండటం సినిమాకు మైనస్ అయింది. సెకండాఫ్ బాగానే ఉన్నా ఫస్టాఫ్ లో ల్యాగ్  ఎక్కువ కావడం అఖండ సినిమాను తలపించే కొన్ని సీన్స్ ఉండటం మూవీకి మైనస్ అయింది.

వైరస్ గురించి సినిమాలు కొన్నేళ్ల క్రితం తెరకెక్కించి ఉంటే  ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవి కానీ ఇప్పుడు మాత్రం ఆ సీన్స్ ప్రేక్షకులను  పూర్తిస్థాయిలో   ఆకట్టుకునేలా లేవు. లాజిక్స్ వెతక్కుండా మాస్ సినిమా చూడాలని భావించే వాళ్లకు అఖండ2 బెస్ట్ ఛాయిస్ కాగా మిగితావాళ్లను `ఏ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.  

సినిమాలో బంధం గురించి చెప్పే కొన్ని డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.  అఘోరా పాత్రలో బాలయ్య రౌద్ర రసంతో అద్భుతమైన అభినయం  కనబరిచారు.  200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ2 బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించడం సులువు కాదు.  

బాలయ్య రెండు పాత్రల్లో అద్భుతమైన అభినయం ప్రదర్శించినా ఎమ్మెల్యే పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు. ప్రగ్యా జైస్వాల్ పాత్రకు దండ వేసి ఆ పాత్ర విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చారు. సంయుక్త మీనన్ పాత్ర సినిమాలో ఒక పాటకు, కొన్ని సీన్లకు  పరిమితమైంది. ఇతర నటీనటులు పాత్రకు అనుగుణంగా నటించారు.

టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే థమన్ బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నందమూరి థమన్ అనే బిరుదుకు థమన్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపించింది. ఫస్టాఫ్ లో  కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే  బాగుండేది.

బలాలు :  సెకండాఫ్, బాలయ్య నటన, మ్యూజిక్, స్టోరీ లైన్

బలహీనతలు : స్క్రీన్ ప్లే, ఫస్టాఫ్, బోయపాటి శ్రీను డైరెక్షన్

రేటింగ్ : 2.5/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: