52 ఏళ్లలోనూ కుర్రాడిలా..
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఎవరికైనా సవాలే. కానీ సోనూ సూద్ విషయంలో 'వయసు అనేది కేవలం అంకె మాత్రమే' అని నిరూపిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. బ్లూ కలర్ టీ షర్టు, షార్ట్ ధరించి, జిమ్ సెంటర్‌లో తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తూ ఆయన ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఇంతటి కఠినమైన వ్యాయామాలు చేస్తూ, శరీరాన్ని ఇంత ఫిట్‌గా ఉంచుకోవడం వెనుక ఆయన క్రమశిక్షణ, అంకితభావం కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. "కుర్ర హీరోలు కూడా కుళ్ళుకునేలా ఉంది మీ ఫిట్‌నెస్" అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
వెండితెర విలన్.. నిజ జీవిత హీరో
సోనూ సూద్ సినీ ప్రయాణం టాలీవుడ్‌లో నాగార్జున హీరోగా వచ్చిన 'సూపర్' సినిమాతో మొదలైంది. ఆ తర్వాత 'అరుంధతి' సినిమాలో ఆయన పోషించిన 'పశుపతి' పాత్ర ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. వరుసగా విలన్ పాత్రలతో మెప్పించిన సోనూ, కరోనా సమయంలో వేల మంది వలస కూలీలకు, బాధితులకు అండగా నిలిచి 'నిజ జీవిత హీరో'గా మారారు.కేవలం ఫిట్‌నెస్ మీద మాత్రమే కాదు, సమాజం పట్ల తన బాధ్యతను కూడా సోనూ సూద్ ఎప్పుడూ మర్చిపోరు.
ఇటీవలే ఆయన 500 మంది మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. భవిష్యత్తులో మరికొంతమందికి కూడా ఈ సాయం అందిస్తామని ఆయన ప్రకటించడం విశేషం.ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే సోనూ సూద్, అటు తన శరీరాన్ని, ఇటు తన సేవా గుణాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి