ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సినిమాల కోసం టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్రత్యేకంగా గ్రాండ్ ఈవెంట్స్‌ను కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్‌కి భారీ ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ అంతకుముందే సినిమా షూటింగ్ సెట్స్ నుంచి సీన్లు లీక్ అవ్వడంతో మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూవీ మేకర్స్ ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇకపై సినిమాల నుంచి ఎలాంటి సీన్లు కూడా లీక్ కాకుండా ఉండేందుకు మరింత స్ట్రిక్ట్ రూల్స్‌ను అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అసలు విషయం ఏంటంటే… ఇకపై సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లో ఎవరైనా సరే కెమెరా ఉపయోగించడం పూర్తిగా నిషేధం చేయాలని నిర్ణయించుకున్నారట. ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు – ఎవరికీ కూడా సెట్స్‌లో మొబైల్ ఫోన్స్ అలౌ చేయరట.సెట్స్‌లోకి అడుగుపెట్టే ముందే అందరి మొబైల్ ఫోన్లను ఒక ప్రత్యేక లాకర్‌లో భద్రపరచేలా ప్లాన్ చేస్తున్నారట. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప, మిగతా సందర్భాల్లో ఫోన్‌ను సెట్స్‌లోకి తీసుకురావడానికి అనుమతి ఉండదట. ఈ రూల్ ప్రతి ఒక్కరికీ వర్తించేలా అమలు చేయాలని భావిస్తున్నారట.
ఇది కేవలం జూనియర్ ఆర్టిస్టులకో లేదా టెక్నీషియన్లకో మాత్రమే కాకుండా, స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు – అందరికీ సమానంగా వర్తించేలా ఉండబోతుందట. స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లకు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు… ఇకపై సినిమా షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారట. అదేంటంటే, సినిమాల్లో నటిస్తున్న ఆర్టిస్టుల కుటుంబ సభ్యులను కూడా సెట్స్‌లోకి అనుమతించకుండా కొత్త రూల్ తీసుకురాబోతున్నారట. ఎవరి ద్వారా అయినా సరే సినిమా లుక్స్ గానీ, సీన్లు గానీ పొరపాటున బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.గతంలో ఎన్నో సందర్భాల్లో ఒక స్టార్ హీరో సినిమా సెట్స్‌లో మరో స్టార్ హీరో కనిపించడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. ఇకపై తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయాలతో అలాంటి పరిస్థితులకు పూర్తిగా చెక్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట.
మొత్తానికి, సోషల్ మీడియా లీకులపై పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించాలనే లక్ష్యంతో మూవీ మేకర్స్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రూల్స్ ఎంతవరకు వర్క్ అవుతాయి? నిజంగా ఇకపై సినిమా నుంచి ఒక్క చిన్న సీన్ కూడా లీక్ కాకుండా కట్టడి చేయగలుగుతారా? అన్నది మాత్రం కాలమే చెప్పాలి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి