నేషనల్ క్రష్ రష్మిక మందన్న – సైలెంట్‌గా పాస్ మార్కులు
నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్న 2025లో మొత్తం ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నాలుగు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. గత ఏడాది ‘పుష్ప 2’తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక, ఈ ఏడాది కూడా అదే ఊపుతో బాక్సాఫీస్ రేస్‌లోకి దిగింది.సంవత్సరం ప్రారంభంలోనే విక్కీ కౌశల్‌తో చేసిన ‘చావా’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రష్మిక మార్కెట్ మరింత బలపడింది. అనంతరం సల్మాన్ ఖాన్ సరసన చేసిన ‘సికిందర్’ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ రష్మికకు నటిగా పెద్ద నష్టం మాత్రం కలగలేదు.తర్వాత ‘కుబేర’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. క్యారెక్టర్‌కు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో రష్మిక మరోసారి తన సత్తా చాటింది. హిందీలో విడుదలైన ‘థామా’ సినిమా మాత్రం రష్మికకు నిరాశ మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోయినా, వెంటనే వచ్చిన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి పాస్ మార్కులు సాధించింది. ఈ సినిమాతో రష్మిక వ్యక్తిగతంగానూ బాగా కనెక్ట్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. మొత్తంగా చూస్తే, భారీ హిట్లు లేకపోయినా, వరుస సినిమాలు చేస్తూ సైలెంట్ పాయిజన్‌లా రష్మిక ఈ ఏడాది పాస్ అయిపోయింది అని చెప్పవచ్చు.
శ్రీలీల – క్రేజ్ ఉన్నా ఫలితం లేని సంవత్సరం :
ఒక దశలో వరుస అవకాశాలతో టాలీవుడ్‌ను షేక్ చేసిన శ్రీలీల, ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొంది. బ్రేక్ తర్వాత ‘కిస్సిక్’ పాటతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా, ఆ ఊపు సినిమాల విషయంలో కొనసాగలేదు.ఈ ఏడాది నితిన్‌తో ‘రాబిన్ హుడ్’, రవితేజతో ‘మాస్ జాతర’, గాలి కిరీటి సరసన ‘జూనియర్’ సినిమాలు చేసింది. అయితే ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. భారీ క్రేజ్, మంచి డాన్స్ స్కిల్స్ ఉన్నప్పటికీ, సరైన కథలు లేకపోవడం ఆమెను వెనక్కి నెట్టినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాదిని కూడా ఫ్లాప్‌లతోనే ముగించింది శ్రీలీల.
అనుష్క శెట్టి – ఆశలన్నీ ‘ఘాటీ’పైనే… కానీ నిరాశే:
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఘాటీ’. దర్శకుడు క్రిష్‌పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాపై అనుష్క చాలా ఆశలు పెట్టుకుంది. థియేటర్లలో సందడి చేసినప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.‘ఘాటీ’ ఫెయిల్యూర్ అనుష్కకు తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో సినిమాల నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించింది. అభిమానులకు ఇది కాస్త షాక్ ఇచ్చిన వార్తగా మారింది.
కీర్తి సురేష్ – ఓటీటీ వరకే పరిమితం:
నేషనల్ అవార్డు విజేత కీర్తి సురేష్ కూడా 2025లో పెద్దగా మెప్పించలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్‌లు లేకుండా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్టులకే పరిమితమైంది. ‘ఉప్పు కప్పురంబు’ ఓటీటీలో విడుదల కాగా, ‘రివాల్వర్ రీటా’ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఏడాది కీర్తి కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ హైలైట్ ఏదీ లేకుండానే గడిచిపోయింది.
భాగ్యశ్రీ బోర్సె – ట్రెండింగ్ పేరు… కానీ హిట్ మాత్రం లేదు:
ఇక ఈ ఏడాది బాగా ట్రెండ్ అయిన మరో పేరు భాగ్యశ్రీ బోర్సె. సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగినా, సినిమాల పరంగా మాత్రం ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అవేవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. క్రేజ్ ఉన్నప్పటికీ, కంటెంట్ ఎంపికలో చేసిన పొరపాట్లు ఆమెను వెనక్కి నెట్టాయని టాక్.
మొత్తం లెక్క వేసుకుంటే…
ఈ విధంగా 2025ని పరిశీలిస్తే, రష్మిక మందన్న మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచింది అని చెప్పవచ్చు. భారీ క్రేజ్ ఉన్న శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సె మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫెయిల్ అయ్యారు. అనుష్క, కీర్తి లాంటి సీనియర్ హీరోయిన్లకు కూడా ఈ ఏడాది ఆశించిన ఫలితాలు దక్కలేదు.
2026లో అయినా ఈ హీరోయిన్లు సరైన కథలు ఎంచుకుని కమ్‌బ్యాక్ ఇస్తారా? లేక రష్మిక డామినేషన్ కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే...!?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి