హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మహిళల డ్రెస్సింగ్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ భరద్వాజ్ తీవ్ర స్థాయిలో స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.ఈ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం నటుడు శివాజీ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తుండగా, మరో వర్గం యాంకర్ అనసూయకు సపోర్ట్ చేస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా మొత్తం ఈ అంశంతో వేడెక్కిపోయింది.


ఇదిలా ఉండగా, శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత అనసూయ శారీలో ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మరో చర్చకు దారితీసింది. ఈ ఫొటోలపై కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ కౌంటర్లు వేశారు. దీంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది.అంతేకాదు, తాజాగా అనసూయ స్విమ్ షూట్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడం మరోసారి సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. కొంతమంది కావాలనే ఈ వీడియోను షేర్ చేసి వివాదాన్ని మరింత పెంచుతోందని విమర్శలు చేయగా, మరికొంతమంది అనసూయ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంతో యాంకర్ అనసూయ తాజాగా చేసిన మరో పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో ఆమె మీడియా తీరుపై, కొంతమంది వ్యక్తుల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.



అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ..“కొంతమంది రాబందులు, కొన్ని పనికిమాలిన మీడియా ఛానళ్లు, సామాజిక అవగాహన లేని కొంతమంది స్మార్ట్‌ఫోన్ల ద్వారా నాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి, తమకు తోచిన రీతిలో పోస్టులు పెడుతున్నారు. దీని వల్ల సామాన్య ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీడియా కొన్ని సందర్భాల్లో నిజాన్ని వక్రీకరిస్తూ సెన్సేషన్ కోసం వ్యక్తిగత విషయాలను తప్పుగా ప్రచారం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని, కావాలని నెగిటివ్ ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.



ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అనసూయకు మద్దతుగా పలువురు నెటిజన్లు నిలుస్తూ, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ వివాదంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా చెప్పాలంటే, హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై మొదలైన ఈ వివాదం ఇప్పుడు మీడియా తీరుపై, వ్యక్తిగత స్వేచ్ఛపై పెద్ద చర్చకు దారి తీసింది. యాంకర్ అనసూయ చేసిన ఈ తాజా పోస్ట్‌తో మరోసారి సోషల్ మీడియా హీట్ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


https://www.instagram.com/p/DSwLhjTE7rW/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==






మరింత సమాచారం తెలుసుకోండి: