ఇదే సమయంలో చరణ్‌కు కో-స్టార్స్‌గా నిలిచిన స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ మాత్రం తమ కెరీర్‌ను చాలా స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేసుకుంటూ సాలిడ్ లైనప్‌ను సెట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో ప్రాజెక్ట్స్ చేస్తుండగా, అల్లు అర్జున్ కూడా వరుసగా క్రేజీ కాంబినేషన్లతో సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. మరోవైపు ప్రభాస్ చేతిలో కూడా ఒకటి కాదు, రెండు కాదు… వరుసగా భారీ సినిమాలు ఉన్నాయి.కానీ ఈ స్టార్ హీరోలతో పోలిస్తే రామ్ చరణ్ నుంచి మాత్రం సుకుమార్ సినిమా తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాధానం రాలేదు. దీనితో చరణ్ ఫ్యాన్స్‌లో ఒక రకమైన టెన్షన్ మొదలైంది.
మధ్యలో సందీప్ రెడ్డి వంగా, లోకేష్ కనగరాజ్ వంటి క్రేజీ డైరెక్టర్లతో చరణ్ సినిమా చేస్తాడంటూ కొన్ని రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే అవన్నీ కొద్ది రోజుల్లోనే క్లారిటీ లేకుండా మాయమయ్యాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఆ వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పడింది.ఇలాంటి పరిస్థితుల్లో, తన సమకాలీన స్టార్ హీరోలతో పోలిస్తే రామ్ చరణ్ లైనప్ విషయంలో కాస్త వెనుకబడ్డాడు అని చెప్పక తప్పదు. స్టార్‌డమ్, మార్కెట్, అభిమాన బలం అన్నీ ఉన్నప్పటికీ, భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.
మరి రాబోయే రోజుల్లో అయినా చరణ్ నుంచి ఒక బలమైన అనౌన్స్‌మెంట్ వస్తుందా? లేదా ఈ సైలెన్స్ ఇంకా కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నుంచి త్వరలోనే ఒక సాలిడ్ అప్‌డేట్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి