జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం సృష్టించాయి.ఆయన్ని వెంటనే జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటూ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరి ఇంతకీ నాగబాబు చేసిన తప్పేంటి..ఆయన సంఘవిద్రోహి అని జనసేన కార్యకర్తలు ఎందుకు విమర్శిస్తున్నారు.జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నటుడు శివాజీ దండోరా మూవీ ప్రమోషన్స్ లో ఆడవాళ్ళ బట్టల గురించి చేసిన కామెంట్లు ఎంత వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. చాలామంది ఆయన చేసిన కామెంట్లని తప్పు పట్టారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం ఆయన వైపే ఉన్నారు. శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు.ఆయన ఆడవాళ్ళ బట్టల గురించి నిజాలే మాట్లాడారు.ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని సపోర్ట్ ఇచ్చారు. 

కానీ సెలబ్రిటీలలో కొంతమంది మాత్రం ముఖ్యంగా చిన్మయి,అనసూయ, నిధి అగర్వాల్ వంటి వాళ్లు ఆయన మాట్లాడిన మాటలను వ్యతిరేకించారు. కానీ సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాత్రం శివాజీ వైపే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శివాజీ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, నిర్మాత జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నేను ఎవరిని విమర్శించాలి.. ఎవరిని తప్పు పట్టాలి అనుకోవడం లేదు.కానీ ఆడవాళ్లు సమాజంలో ఎలా బతకాలి అనేది వాళ్ళ ఇష్టం. ఆడవాళ్లు వేసుకునే బట్టల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సమాజంలో మగవాళ్ళు ఎలా ఉన్నారో వారికి సమానంగా ఆడవాళ్లు కూడా ఉండాలి. వారు వేసుకునే బట్టల పై కామెంట్ చేయడం తగదు.అలాగే ఇక్కడ అందర్నీ విమర్శించడం లేదు. కేవలం ఆడవారిని ఆ దృష్టిలో చూసే మగవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.

ఆడపిల్లలు వేసుకునే బట్టలు ఎలా ఉండాలో పూర్తిగా మీ ఇష్టం.కానీ మీకోసం మీరు ప్రత్యేకంగా రక్షణ తీసుకోండి. మహిళలను కించపరిచిన వాళ్ళు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేరు. ఇలాంటి విషయంపై స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ శివాజీ మాట్లాడిన మాటలపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే నాగబాబు మాట్లాడిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.. జనసేన పార్టీ నుండి నాగబాబుని వెంటనే సస్పెండ్ చేయండి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా.. సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడిన నాగబాబుని వెంటనే జనసేన పార్టీ నుండి తొలగించండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులు రాజకీయాలలో ఉన్నత పదవుల్లో ఉండడానికి అర్హులు కాదు.. అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.దీంతో ఇది కాస్త సంచలనంగా మారడంతో #SuspendNagaBabuFromJSP అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: