ఇక ఇదే ఏడాదిలో విడుదల కావాల్సిన మరో కీలక చిత్రం ‘రాజా సాబ్’ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ చివరకు జనవరిలో విడుదలకు షిఫ్ట్ అయ్యింది. ఈ సినిమా నిధి కెరీర్‌కు కీలకమైన మలుపు అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఇదిలా ఉండగా, నిధి అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులతో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన డ్రీమ్ మల్టీ స్టారర్ కాంబినేషన్ గురించి మాట్లాడిన నిధి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నిధి మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించే ఒక క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించాలని తనకు ఎంతో కోరికగా ఉందని వెల్లడించింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల అని చెప్పుకొచ్చింది.‘హరిహర వీరమల్లు’, ‘రాజా సాబ్’ సినిమాల షూటింగ్ సమయంలో తన హీరోల యాటిట్యూడ్, డెడికేషన్, వర్క్ ఎథిక్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని నిధి పలుమార్లు వెల్లడించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లు ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటారో దగ్గర నుంచి చూసిన అనుభవం తనను ఫిదా చేసిందని ఆమె పేర్కొంది. బహుశా అదే కారణంతో ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమానే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మారిందని చెప్పవచ్చు.
ఇక ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌ను తెరకెక్కించే దర్శకుడిగా కూడా నిధి ఓ షాకింగ్ పేరు చెప్పింది. పవన్ కళ్యాణ్ – ప్రభాస్ లాంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించగల సత్తా ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రమేనని ఆమె అభిప్రాయపడింది. ఆయన స్టైల్, ఇంటెన్స్ నేరేషన్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ ఈ మల్టీ స్టారర్‌కు న్యాయం చేస్తాయని నిధి చెప్పింది.ఇలాంటి మ్యాడ్ కాంబినేషన్‌లో తానే హీరోయిన్‌గా నటించాలని తన మనసులోని కోరికను నిధి ఎలాంటి మొహమాటం లేకుండా అభిమానులతో పంచుకుంది. ఇలాంటి కలయికలు ఊహల్లోనే చాలా బాగుంటాయని, కానీ అవి నిజంగా తెరపై సెట్ అయితే వాటి ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుతం నిధి చెప్పిన ఈ ఊహించని డ్రీమ్ కాంబినేషన్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ – ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కలయికపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్ సెట్ అయితే టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇక భవిష్యత్తులో ఈ డ్రీమ్ కాంబినేషన్ రియాలిటీలోకి వస్తుందో లేదో చూడాలి. కానీ నిధి అగర్వాల్ చెప్పిన ఈ మాటలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి