ఈ సినిమాతో బాలయ్య అమెరికా బాక్సాఫీస్‌లో అరుదైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలకృష్ణ నటించిన సినిమాలు వరుసగా భారీ వసూళ్లు సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
నార్త్ అమెరికాలో బాలయ్య హవా :
నార్త్ అమెరికాలో బాలయ్య నటించిన కింది సినిమాలు వరుసగా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం విశేషం:
*అఖండ
*వీరసింహారెడ్డి
*భగవంత్ కేసరి
*డాకు మహారాజ్
*అఖండ 2 – తాండవం
ఈ ఐదు సినిమాలు వరుసగా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం అంటే సాధారణ విషయం కాదు. ఒక హీరో నటించిన సినిమాలు… అది కూడా కంటిన్యూస్‌గా ఐదు సినిమాలు 1 మిలియన్ డాలర్లు దాటడం అనేది వెరీ రేర్ అచీవ్‌మెంట్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో ఘనమైన రికార్డ్:
ఇంతకుముందు బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా కూడా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి అప్పట్లోనే రికార్డు సృష్టించింది. దాంతో కలిపి మొత్తం ఆరు సినిమాలు నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసిన ఘనతను బాలయ్య సాధించారు.
ఈ ఘనతతో, ఆరు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా..యూనిక్ ట్రాక్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న నటుడిగా నందమూరి బాలకృష్ణ మరోసారి తన అసమానమైన మార్కెట్ స్టామినాను నిరూపించారు. ఈ రికార్డుతో నందమూరి అభిమానుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. సోషల్ మీడియాలో “జై బాలయ్య” నినాదాలతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా, ఎనర్జీ, మాస్ అప్పీల్, మార్కెట్ పవర్‌తో బాలయ్య ఇంకా టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారని మరోసారి రుజువైంది. నిజంగా ఇది నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే… బాలయ్య బ్రాండ్ అంటే ఇదే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి