ప్రస్తుతం సాయి పల్లవి కొత్త సినిమాలను కమిట్ అవ్వడం కంటే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలనే పూర్తి చేయడంపై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… సాయి పల్లవి ఓ ఆపరేషన్ చేయించుకోబోతుందా? అన్న వార్త.ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. ముఖ్యంగా ఆమె అభిమానులు ఈ వార్త విని షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సాయి పల్లవి కానీ, ఆమె టీమ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న కథనం ప్రకారం, సాయి పల్లవి ఎక్కువగా ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ చేస్తుంటుంది. డాన్స్ చేస్తూ నడుమును గిరగిరా తిప్పే స్టెప్స్‌లో, ఇటీవల ఓ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయం అయిందట. ఆ గాయం పెద్దది కాకపోయినా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు డాక్టర్ల సూచన మేరకు ఒక మైనర్ సర్జరీ చేయించుకోబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అలాగే ఆ సర్జరీ అనంతరం ఆమెకు సుమారు మూడు నెలల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని కూడా ఆ వార్తల్లో పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని, కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే దీనిపై సాయి పల్లవి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. అందుకే అభిమానులు ఇది నిజమైన సమాచారం ఆ? లేక కేవలం సోషల్ మీడియాలో పుట్టిన పుకారా? అనే సందేహంలో పడిపోయారు.సాయి పల్లవి లాంటి నేచురల్ స్టార్ విషయంలో ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమెకు సంబంధించి ఇలాంటి ఎన్నో రూమర్స్ వచ్చాయి, అవన్నీ తర్వాత అబద్ధాలని తేలిపోయాయి. ఈసారి కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడడమే మంచిదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మొత్తానికి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆపరేషన్ వార్తపై స్పష్టత రావాలంటే సాయి పల్లవి నుంచే అధికారిక ప్రకటన రావాల్సిందే. అంతవరకు ఇది కేవలం పుకారేనా? లేక నిజంగానే నిజమా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియదు. అభిమానులు మాత్రం ఆమె ఆరోగ్యంగా ఉండాలని, త్వరలోనే మంచి సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి