ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వార్త జెట్ స్పీడ్‌లో వైరల్ అవుతూ భారీ చర్చకు దారి తీస్తోంది. ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన అందాల తార ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో ఆమె సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయంటే చాలు… కుర్రాళ్లు షర్ట్లు విప్పి, అరుపులు కేకలతో థియేటర్లను స్టేడియంలా మార్చేసేవారు. అలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. ఇక భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేకపోవడం ఆమె గురించి ఆసక్తిని మరింత పెంచుతోంది.ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్‌లో ఉన్న ఈ బ్యూటీ, మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ, రీసెంట్‌గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను స్ట్రాంగ్‌గా స్టార్ట్ చేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమెకు మళ్లీ మంచి అవకాశాలు వస్తున్నాయని టాక్. ఇదే సమయంలో ఆమె గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఓ కోలీవుడ్ సినిమాలో ఒక సీనియర్ హీరోతో కీలకమైన రొమాంటిక్ సీన్ చేయడానికి ఈ సీనియర్ బ్యూటీ ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అంతేకాదు, ఆ మొత్తాన్ని కూడా స్పాట్ పేమెంట్‌గా ఇవ్వాలని కండిషన్ పెట్టిందని టాక్. ఈ విషయం వినగానే డైరెక్టర్‌తో పాటు ప్రొడక్షన్ టీమ్ మొత్తం షాక్‌కు గురైందట.ఈ డిమాండ్ బయటకు రావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా స్పందిస్తున్నారు.
కొంతమంది మాత్రం,“ఇది చాలా చాలా టూమచ్. యంగ్ హీరోయిన్ కూడా లిప్ లాక్ సీన్‌కు ఇంత డబ్బు డిమాండ్ చేయదు. ఈ సీనియర్ బ్యూటీ హద్దులు మీరి పోతుంది” అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే, “ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చే బదులు యంగ్ బ్యూటీకే ఆ డబ్బులు ఇచ్చి ఆమెతోనే లిప్ లాక్ సీన్ తీయొచ్చు”అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

అయితే మరో వర్గం మాత్రం ఈ విమర్శలకు పూర్తిగా భిన్నంగా స్పందిస్తోంది.“ఆమె అందం, ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె బ్రాండ్ వాల్యూ చూసే ఇలాంటి డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ కాబట్టి ఆమె అడిగితే తప్పేంటి?” అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా, ఈ వార్త నిజమా కాదా అన్నది అధికారికంగా ఎవ్వరూ ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ విపరీతమైన ట్రెండింగ్‌లో ఉంది. కామెంట్లు, మీమ్స్, వీడియో రియాక్షన్లతో నెటిజన్లు హంగామా చేస్తున్నారు.

ఇక ఈ సీనియర్ బ్యూటీ నిజంగానే అంత భారీ డిమాండ్ పెట్టిందా? డైరెక్టర్ ఆమె కండిషన్లకు ఓకే చెప్పాడా లేదా? లేదా ఇదంతా కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే మాత్రం ఇంకొంతకాలం ఆగాల్సిందే. అప్పటివరకు ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హీట్ పెంచుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: