సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో పండగ వాతావరణం నెలకొనడమే కాదు సినిమా థియేటర్లు కూడా కళకళలాడుతాయి.ఎందుకంటే చాలామంది హీరోలు సంక్రాంతి పండగని టార్గెట్ గా పెట్టుకొని తమ సినిమాలను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు కిటకిటలాడుతాయి.. ఎంతో మంది స్టార్ హీరోలు సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని తమ సినిమాలను విడుదల చేస్తారు.అలా సంక్రాంతికి ఊరెళ్ళిన చాలా మంది కుటుంబంతో సహా కలిసి వెళ్లి చూసేలా కొన్ని సినిమాలు ఉంటాయి. అయితే మరో వారంలో సంక్రాంతి పండుగ రాబోతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద హీరోలు తమ సినిమాల కి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. 

ఇదిలా ఉంటే 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ విన్నర్ అయిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. 2023 సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లతోపాటు తమిళం నుండి స్టార్ హీరోస్ అయిన అజిత్,విజయ్ లు కూడా తలపడ్డారు. అలా 2023 సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. అలా విడుదలైన ఈ నాలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసేయి.కానీ ఈ రెండు సినిమాల్లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ విషయంలో  కాస్త ముందు నిలవడంతో 2023 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ నిలిచింది.

ఇక వీర సింహారెడ్డి సినిమా కూడా కలెక్షన్స్ పరంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది.అలాగే విజయ్ నటించిన వారసుడు,అజిత్ నటించిన తెగింపు రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ని అందుకున్నాయి. అలాగే సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది.అలా విజయ్ నటించిన వారసుడు అజిత్ నటించిన తెగింపు రెండు సినిమాలు కూడా జనవరి 11 విడుదల కాగా.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి జనవరి 12న,చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న, సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం జనవరి 14న విడుదలైంది. అలా విడుదలైన అన్ని సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సినిమాగా వాల్తేరు వీరయ్య మూవీ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: