ఈ పరిస్థితి మరీ హద్దులు దాటడంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. తన వ్యక్తిగత స్పేస్‌ను గౌరవించకుండా ఇలా ప్రవర్తించడం సరైంది కాదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఈ వీడియోను ముఖ్యంగా మరో స్టార్ హీరో అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. “మీ హీరో ఇలా ప్రవర్తించడం ఏంటి?” అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని ఈ వీడియోను వక్రీకరించి, ఎన్టీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు.దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. “ఒక హీరో సీరియస్ వర్క్‌లో ఉన్నప్పుడు లేదా వ్యక్తిగత సమయంలో, అనుమతి లేకుండా ఫోటోలు తీయడం ఎంతవరకు సమంజసం?” అంటూ ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరో అయినంత మాత్రాన ఆయనకు ప్రైవసీ ఉండకూడదా అని నిలదీస్తున్నారు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వీడియో అసలు తాజాదే కాదని, ఇది పాత వీడియో అని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. కావాలని మళ్లీ ఇప్పుడు బయటకు తీసుకొచ్చి, ట్రోలింగ్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారని అంటున్నారు. ఇది పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచే ప్రయత్నమేనని, తారక్ ఇమేజ్‌ను తొక్కేసే కుట్రగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి, ఈ వీడియో చుట్టూ జరుగుతున్న చర్చలు చూస్తే, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, వారి ప్రైవసీకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది. అభిమానమంటే హద్దుల్లో ఉండాలి తప్ప, అసహనానికి, అపార్థాలకు దారి తీయకూడదని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి