ఈ వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. “సిగ్గు-శరం లేకుండా ఇలా ఎలా ప్రవర్తించగలరు?”, “ఇది పబ్లిక్‌లో జరిగే ప్రవర్తనకేనా?” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు అయితే, సెలబ్రిటీలు అయినా సరే పబ్లిక్‌లో మర్యాద పాటించాల్సిందే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదే సమయంలో, ఈ వీడియోపై వస్తున్న కొన్ని కామెంట్లు మరింత దారుణంగా మారుతున్నాయి. అసభ్య పదజాలంతో, వ్యక్తిగతంగా దూషించేలా కామెంట్లు చేయడం కూడా పెరిగిపోతోంది. దీంతో మరోసారి ప్రగ్యా జైస్వాల్ పేరు సోషల్ మీడియాలో అనవసర వివాదంలో చిక్కుకుంది. అసలు ఈ ఘటన ఉద్దేశపూర్వకమా? లేక సరదాగా జరిగిన పని తప్పుగా అర్థమైందా? అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది.
ఏది ఏమైనా, పబ్లిక్‌లో వ్యక్తిగత హద్దులు దాటే ప్రవర్తనపై సమాజం ప్రశ్నించడం సహజమే. సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ కెమెరాల నిఘాలోనే ఉంటాయి కాబట్టి, చిన్న ఘటన కూడా పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఘటన మరోసారి పబ్లిక్ ప్రవర్తన, వ్యక్తిగత గౌరవం, సోషల్ మీడియా బాధ్యతలపై చర్చకు దారి తీసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి