పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ ది రాజా సాబ్.. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.అయితే జనవరి 9 కంటే ఒకరోజు ముందే అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ఇక ఈ ప్రీమియర్ షోస్ చూసిన చాలా మంది అభిమానులు ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ ఎలా ఉంది.. డైరెక్టర్ మారుతి ఎలాంటి మ్యాజిక్ చేశారు. ప్రభాస్ సంక్రాంతి బరిలో గట్టెక్కినట్టేనా అనేది ప్రేక్షకులు ఇచ్చిన ట్విట్టర్ రివ్యూ లో చూసుకుందాం. ప్రభాస్ హీరోగా..నిధి అగర్వాల్,రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్లుగా నటించగా..ఆనంది గెస్ట్ రోల్ పోషించిన హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్ మూవీ  జనవరి 8న తెలంగాణ మినహాయించి అన్నిచోట్ల ప్రీమియర్ షోస్ పడిపోయాయి. 

ఇక ఈ ప్రీమియర్ షోస్ చూసిన నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో తన నటనతో ఇరగదీసారని, డైరెక్టర్ మారుతి దర్శకత్వం అద్భుతంగా ఉందని, విఎఫ్ఎక్స్ మాములుగా లేవని, సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కొంతమంది నెటిజన్లు రివ్యూ ఇవ్వగా.. మరికొంతమంది నెటిజన్స్ ఫస్టాఫ్ పీక్స్ లో ఉంది. ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశారు.. కామెడీ బాగుంది. హార్రర్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

 ప్రీ ఇంటర్వెల్ సీన్ నుండి సినిమాలో బాగా ఇన్వాల్వ్ అవుతారు.. అంటూ ట్విట్టర్ ద్వారా తమ స్పందన తెలిపారు. ఇక మరికొంత మందేమో సినిమా కేవలం ప్రభాస్ కోసం మాత్రమే చూడవచ్చని, స్లో డైరెక్షన్ అని, సినిమా అంత బాగోలేదని, సంక్రాంతి బరిలో ఈ మూవీ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ కావడం చాలా కష్టం అని.. మారుతి డైరెక్షన్ లో ఇంతకంటే ఎక్కువగా ఆశించలేమని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.మరి సినిమా టోటల్ గా ఎలా ఉందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: