టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ థియేటర్ల లోకి వచ్చింది. ఫీపుల్స్ మీడియా బ్యానర్ పై అగ్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ - రిద్ది కుమార్ - నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా కు మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమా లో ప్లస్‌ల కంటే మైనస్ లే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్లస్ లు భూతద్దంలో పెట్టి వెతుక్కోవాల్సిందే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా కు ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి ? మైనస్ పాయింట్లు ఏంటి ? ఆ లెక్కలేంటో చూద్దాం.
ప్లస్ పాయింట్లు :
- ప్రభాస్ లుక్
- ఫ్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సీన్
- చాలా సీన్లలో థమన్ బీజీఎం
- మాళవిక మోహనన్‌తో కొన్ని రొమాంటిక్ సీన్లు
మైనస్ పాయింట్లు :
ఫస్టాఫ్ చాలా యావరేజ్ అనుకుంటే సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక 20 నిమిషాలు ఓకే.. అక్కడ నుంచి సినిమా ఎటు వెళుతుందో.. అర్థం కాదు. లాజిక్‌లు పూర్తిగా మిస్ ... సీన్లు గందరగోళం
- వీక్ స్క్రీన్ ప్లే
- వీక్ రైటింగ్
- ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ కథ కాదు
- కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఎడిటర్ కూడా సినిమాను కాపాడలేని పరిస్థితి
- సెకండాఫ్ కూడా ఏ మాత్రం మెప్పించలేదు
- రిద్ది కుమార్, నిధి అగర్వాల్ మైనస్
- ఆకట్టుకోని పాటలు.. ఏ ఒక్కటి మైండ్‌లో రిజిస్టర్ కాలేదు
- సంక్రాంతి రేసులో నిలబడడం కష్టమే...
- ప్రభాస్ అభిమానులు, మాస్‌కే నచ్చలేదు అని చెపుతున్నారు
- వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా చోట్ల తేలిపోయింది
- పాటలు కూడా ఆకట్టుకో లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి