ఇలా తమ కుటుంబంలో చాలామంది యాక్టర్స్ ఉన్నారని అయితే తాను ఇండస్ట్రీలోకి వస్తానంటే మాత్రం ఎవరూ కూడా అంగీకరించలేదు. కానీ తనకి నటన మీద ఉండే ఆసక్తి చూసి తనను సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. వారి సపోర్టు లేకపోతే తాను ఇండస్ట్రీలోకి వచ్చేదాన్ని కాదని, అలా ఒప్పించడానికి తాను చాలా కష్టపడ్డానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం డింపుల్ హయాతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇంతటి బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఈ విషయాన్ని డింపుల్ హయాతి బయట చెప్పలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2017లో గల్ఫ్ అనే తెలుగు డబ్బింగ్ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి, రామబాణం తదితర చిత్రాలలో నటించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి