మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇలా వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఉపాసన 11 సంవత్సరాలకు బిడ్డకు జన్మనిచ్చారు.ఉపాసన జూన్ 20వ తేదీ అపోలో హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా కొణిదెల అనే నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ తన కూతురి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఉపాసన డెలివరీ సమయం దగ్గర పడుతున్నప్పటినుంచి చరణ్ తన భార్యకు తోడుగా ఉన్నారు.ఇలా తన భార్యకు బిడ్డకు తన అవసరం ఎంతో ఉంటుందని భావించినటువంటి రామ్ చరణ్ సినిమా షూటింగ్ పనులకు కూడా బ్రేక్ ఇచ్చి తన భార్యతో ఈ అద్భుతమైన క్షణాలను గడుపుతూ ఉన్నారు. అయితే ఉన్నఫలంగా రామ్ చరణ్ తన నిర్ణయం మార్చుకొని తిరిగి సినిమా షూటింగ్ పనులకు వెళ్లడానికి సిద్ధమయ్యారట. ప్రస్తుతం ఈయన గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో సరికొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో రామ్ చరణ్ వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చరణ్ తన భార్య కూతురిని వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారట.మరోవైపు చిరంజీవి సురేఖ దంపతులు కూడా చిన్నారి పుట్టిన కొద్ది రోజులకే వీరిద్దరూ అమెరికా వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.మరోవైపు రాంచరణ్ సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నారు. ఇలా కూతురు పుట్టిన తర్వాత అందరూ తనని వదిలేసి ఎవరి పనుల కోసం వాళ్లు వెళ్లడంతో ఉపాసన చాలా హార్ట్ అయ్యారని తెలుస్తుంది.మరి కొద్ది రోజులపాటు చరణ్ తనతో తన కూతురితో తన టైం స్పెండ్ చేస్తే బాగుండని ఉపాసన భావించారట. కాకపోతే తప్పనిసరి పరిస్థితులలో రామ్ చరణ్ సినిమా షూటింగ్ కోసం కూతురిని వదిలి వెళ్లాల్సి వస్తుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: