ఈ మధ్య కాలంలో అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ తో కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నాయి. దేవన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణలీల నవంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ నెల 6వ తేదీన ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ఈ సినిమాలో దేవన్ కు జోడీగా ధన్య బాలకృష్ణన్ నటించగా వినోద్ కుమార్, సరయు, బబ్లు పృథ్వీ కీలక పాత్రల్లో నటించారు.


కథ :

విహారి (దేవన్)  యూఎస్ లో యోగా గురువుగా బాగా పాపులర్.  సోదరి పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన విహారి  తొలి  చూపులోనే బృందతో (ధన్య బాలకృష్ణన్) ప్రేమలో పడతాడు.  విహారిని తన ప్రేమకు సంబంధించిన గత జన్మ జ్ఞాపకాలు కూడా వెంటాడతాయి. బృంద హోమ్ మినిష్టర్ కూతురు కాగా విహారి పేరెంట్స్ పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్లగా బృంద తండ్రి,  హోమ్ మినిష్టర్ (వినోద్ కుమార్) పెళ్ళికి అంగీకరించకపోవడంతో పాటు వాళ్ళను అవమానిస్తాడు.


ఆ తర్వాత విహారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బృందను చంపేశాను అని చెబుతాడు. పోలీసుల ఎంక్వయిరీలో బృంద బ్రతికే ఉందని తెలుస్తుంది.  అప్పుడు విహారి తాను  గత జన్మలో బృందను చంపానని చెబుతాడు.  విహారి  గతం ఏంటి? గత జన్మలో  విహారి బృందను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ జన్మలో బృంద విహారి ప్రేమ సఫలమైందా?  అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.


విశ్లేషణ :

పునర్జన్మ బ్యాక్ డ్రాప్ లో నాగార్జున జానకిరాముడు, మగధీర సినిమాలతో పాటు  అల్లరి నరేష్ ప్రాణం, ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం  ఎలా, మరికొన్ని సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.  పునర్జన్మ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కృష్ణలీల సినిమాలో ఫస్ట్  సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ లో  ఉంది. దేవన్, ధన్య బాలకృష్ణన్ తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమాలో డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.


పునర్జన్మకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.  ఇంటర్వల్ ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంది.  ఆసక్తిని పెంచేలా స్క్రీన్ ప్లే ఉండటం ఈ సినిమా స్థాయిని పెంచింది.  క్లైమాక్స్ ను సైతం కొత్తగా ప్లాన్ చేశారు.  అయితే కొన్ని రొటీన్ సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి.


హీరో, డైరెక్టర్ అయిన దేవన్ కు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పవచ్చు.  భవిష్యత్తులో దేవన్  మరిన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది.  ధన్య బాలకృష్ణన్ రెండు వేర్వేరు లుక్స్ లో కనిపించగా  రెండు పాత్రలతో ఆకట్టుకున్నారు.  వినోద్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో   ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి గుర్తింపు ఉన్న పాత్ర దక్కింది.


టెక్నికల్ గా కూడా  సినిమా టాప్ లో ఉంది.   భీమ్స్ సిసిరోలియో సాంగ్స్, మ్యూజిక్ తో మెప్పించారు. సినిమా ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడలేదు.  ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.  ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించారు. సినిమాటోగ్రఫీ  భారీ బడ్జెట్ సినిమాల స్థాయిలో ఉంది.  డివోషనల్  టచ్ ఉండటం ఈ సినిమాకు  మరింత ప్లస్ అయింది.


ప్లస్ పాయింట్స్ :  స్క్రీన్ ప్లే, ప్రధాన నటీనటుల నటన, మ్యూజిక్


మైనస్ పాయింట్స్ : కొన్ని రొటీన్ సన్నివేశాలు


రేటింగ్ :  2.75/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: