సినిమా పేరు: ప్రేమంటే
తారాగణం: ప్రియదర్శి, ఆనంది, సుమ, వెన్నెల కిశోర్
దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
సంగీతం: లియోన్ జేమ్స్
కెమెరా: విశ్వనాథరెడ్డి
నిర్మాతలు: పుస్కూర్ రామ్మోహన్‌రావు, జాన్వీ నారంగ్

ప్రియదర్శి–ఆనంది జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘ప్రేమంటే’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడు. "థ్రిల్ ప్రాప్తిరస్తు" అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ చిత్రం ఎంత మేరకు ఆకట్టుకుంది? అనేది ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!


కథ ఏంటి?

రమ్య (ఆనంది) పెళ్లికి దూరంగా ఉండే అమ్మాయి. అభిప్రాయలు కలవక పెళ్లి చేసుకోదు.  మది (ప్రియదర్శి) కూడా తన వ్యక్తిగత సమస్యల వల్ల పెళ్లి వద్దనుకునే అబ్బాయి. ఓ పెళ్లిలో ఇద్దరూ కలవడం… ఆ పరిచయం ప్రేమగా మారి, తర్వాత పెళ్లి వరకు వెళ్లే ట్రాక్‌ ఆసక్తికరంగా సాగుతుంది. పెళ్లి తర్వాత మొదటి నెల చాలా హ్యాపీగా గడుస్తుంది. కానీ బాధ్యతల కారణంగా రమ్య ఆఫీస్, మది తన సిసీ కెమెరాలు–లాక్స్ బిజినెస్‌లో బిజీ అవుతాడు. రాత్రి పూటే ఎక్కువ పని ఉండటంతో ఇద్దరికీ ఒకే టైమ్‌లో కలిసి ఉండే అవకాశం తగ్గిపోతుంది. ఈ కారణంగా రమ్య మనసులో అనుమానాలు మొదలవుతాయి. మది ఎవరితోనో రిలేషన్‌లో ఉన్నాడని భావించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఒక రోజు గొడవలో మది తన బిజినెస్‌కు సంబంధించిన రహస్యం బయటపెడతాడు. దాంతో రమ్య షాక్ అవుతుంది. అసలు ఆ రహస్యం ఏమిటి? వారి వైవాహిక జీవితం తర్వాత ఏ దారిలో వెళ్లింది? ఇది సినిమా మిగిలిన కథ.



పర్ఫార్మెన్స్ & టెక్నికల్‌గా :

ప్రియదర్శి–ఆనంది జంట చాలా నేచురల్‌గా కనిపించారు. ఇద్దరి కెమిస్ట్రీ కథకు అందంగా సెట్ అయింది. రమ్య పాత్రలో ఆనంది చాలా బాగా నటించింది. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంది. సుమ కనకాల పోషించిన ఆశామేరీ పాత్ర సినిమాకి పెద్ద బలం. ఆమెతో కలిసి వెన్నెల కిశోర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విజువల్స్‌ అందంగా ఉన్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు మంచి ఫీల్ ఇచ్చింది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ భార్యాభర్తల కథను కొత్త యాంగిల్‌లో చూపించాడు. ఎవరికి ఇచ్చిన పాత్రల్లో వాళ్ళు బాగా నటించారు. అదే ఈ సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్.



ప్లస్ పాయింట్లు:

*హీరో–హీరోయిన్ కెమిస్ట్రీ

*కథ, ఎమోషనల్ ట్రాక్

*సుమ–వెన్నెల కిశోర్ హాస్య సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

*కొన్ని కామెడీ ట్రాక్స్ ఓవర్‌గా అనిపించడం

* కొన్నిసీన్స్ లాగినట్లు ఫీలింగ్

* ప్రిడిక్టబుల్ సీన్స్

సింపుల్‌గా చెప్పాలంటే: రొమాన్స్ + కామెడీ + లైట్ ఎమోషన్స్ కావాలనుకునే కపుల్స్‌కి ‘ప్రేమంటే’ ఒక డీసెంట్ మూవీ. భార్య-భర్త ఇద్దరు వర్క్ చేసే కపుల్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

రేటింగ్: 2.75/5

మరింత సమాచారం తెలుసుకోండి: