ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అనే పద్యాన్ని బాగా వంటబంటిచ్చుకున్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోనే ఛార్మి కూడా చేరిపోయింది. ఓ ప్రముఖ డైరెక్టర్ ని ఛార్మి కొట్టిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఛార్మిని ఈ విషయం గురించి అడిగితే... మా ఇద్దరి మధ్యా అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేసింది. ఆయన్ని ఏమీ చేయలేదంటూ గొప్పలు పోయిన ఛార్మి ఇప్పుడు మాట మార్చేసింది. ఛార్మి ప్రస్తుతం జిల్లా ఘజియాబాద్ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఆ సందర్భంగా ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టేసింది. ‘ఆయనగారు నోరు జారారు. శ్రుతి మించారు. అలా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. అందుకే, నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది’ అంటూ నిజం కక్కేసింది. ఎంత లేదనుకున్నా... నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది చెప్పండి?

మరింత సమాచారం తెలుసుకోండి: