మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అమీర్ ఖాన్. ‘తారే జమీన్ పర్’ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకులకు చూపించాడు. కాగా, అమీర్ ఖాన్ మరో సారి దర్శకత్వం వహించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. తన దర్శకత్వం వహించడానికి ఒక మంచి కథ సిద్ధం చేయమని తనకు సన్నిహితులైన రచయితలకు అమీర్ ఖాన్ సూచించాడట. తనకు మంచి కథ కావాలని, బడ్జెట్ గురించి ఆలోచించవద్దని అమీర్ ఖాన్ వారికి చెప్పాడట. అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘ధూమ్ 3’ సినిమాలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీతో ‘పీకే’ అనే సినిమా చేయడానికి కూడా అమీర్ ఖాన్ అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక అమీర్ ఖాన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుందని, అప్పటి లోగా ఆ చిత్రానికి కథ సిద్ధం అవుతుందని అమీర్ ఖాన్ సన్నిహితులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: