తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అచ్చతెలుగు అమ్మాయి అంజలి. షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అంజలి ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తోంది.
కాగా, అంజలి నటించిన తూంగ నగరం అనే తమిళ సినిమాను నలుగురు స్నేహితుల కథ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. గౌరవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నలుగురు యువ హీరోలు నటించారు. ఈ సినిమా తెలుగులోనూ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి