తనకు భాషతో సంబంధం లేదంటోంది నటి కాజల్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా ఏదైనా భాష ఏదైనా కళ ఒక్కటే నంటోంది ఈ ముద్దుగుమ్మ. భాషతో సంబంధం లేకుండా తాను ఏ సినిమాలో బాగా నటించాను అన్నదే తనకు ముఖ్యమంటోంది ఈ భామ. రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన ‘సింగం’ సినిమాతో మంచిపేరు తెచ్చుకొని బాలీవుడ్ కే పరిమితమైపోయందని వార్తలు మీడియాలో గుప్పుమనడంతో జాగ్రత్త పడిన కాజల్ వరుసగా హిట్లిచ్చి దక్షిణాదిన సైతం తాను ముందుంటోంది. ఇదిలా ఉండగా ఈ భామ అక్షయ్ కుమార్ హీరోగా ‘స్పెషల్ 26’, ఎన్టీఆర్ హీరోగా తెలుగులో ‘బాద్ షా’,చిత్రాల్లో నటిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: