గోపిచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముంబయి ముద్దుగుమ్మ గౌరీపండిట్. అయితే ఆ సినిమా హిట్టయినా క్రెడిట్ అంతా చిత్ర హీరోకు, దర్శకుడికి వెళ్లిపోయింది. ఈ ముద్దుగుమ్మ తరువాత కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయింది.
కాగా, గౌరీ పండిట్ తాజాగా హౌస్ ఫుల్ అనే సినిమాలో నటిస్తుంది. నాగచైతన్య హీరోగా వచ్చిన దడ సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ భుయాన్ ఈ హౌస్ ఫుల్ సినిమాకూ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ సినిమాలో అలీ, గౌరీ పండిట్, వేగ, జీవా, విపిన్, ఆర్య, ఆర్కె తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ హౌస్ పుల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చిత్ర యూనిట్ అంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి