పవన్ కల్యాణ్ ఇప్పుడు హైదరాబాద్లో ఆడిపాడుతున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కోసం. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్లో జరుగుతున్న ఈ పాట షూటింగ్ తో మొత్తం సినిమా పూర్తవుతుంది. పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.
త్వరలో పాటల్ని కూడా విడుదల చేస్తారు. ఇందులో తమన్న నాయిక. పవన్ సరసన తమన్న నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ చిత్రం పాటల విడుదల వేడుకకు చిరంజీవితో పాటు బాలీవుడ్ నుంచి అమితాబ్ కూడా పాల్గొంటారని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి