సినిమాకు కెప్టెన్ దర్శకుడు , హీరోలనుండి నటుల వరకు దర్శకుడుగా మారాలని ప్రతి ఒక్కరు ఉత్సాహ పడతారు. అక్కినేని నట వారసుడు సుమంత్ కూడా దర్శకుడుగా మారాలని తెగ సంబర పడుతున్నాడు. హీరో గా ఎటు సినిమాలు లేక పోవడంతో మంచి కధతో దర్శకత్వం వహించాలని కథా అన్వేషణలో పడ్డాడు సుమంత్.
గతంలో నందమూరి తారక రామారావు హీరోగా ఎంతటి పేరు గడించారో, దర్శకుడిగా అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. జగదేకవీరుడి కథ, ఉమ్మడి కుటుంబం, దాన వీర సూర కర్ణ సినిమాలు మంచుకు చాలు. ఆ దారిలో సూపర్ స్టార్ కృష్ట సింహసనం, పలు చిత్రాలకు దర్శకత్వం చేశారు.
ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరావు తారక రామారావుకు నటనలో, చిత్ర నిర్మాణంలోను గట్టి పోటి ఇచ్చినా, నాగేశ్వరరావు దర్శకత్వం విషయంలో మెల్లగా తప్పకున్నారనే చేప్పాలి. 24 శాఖలను సమనయం పరిచే సమర్థత నాకు లేదని ఆయన బాహటంగానే ఓప్పకున్నారు. మెగా స్టార్ చిరంజీవి తన 150 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తాను అని ప్రచారం కూడా జరిగింది. అయినా మాటలు తప్ప చేతలు ముందుకు కదలలేదు.
ఇప్పడు సుమంత్ మెగా పోన్ చేత పట్టపోతున్నారు. నటుడుగా కన్న దర్శకుడిగా సుమంత్ సమర్థుడని అక్కినేని నాగేశ్వరరావు కీతాబు నిచ్చారు. హీరోగా మారక ముందు దర్శకత్వ శాఖలో సుమంత్ కు శిక్షణ పోందిన అనుభవం ఉంది . తన లోని దర్శకుడు ఎప్పడు బయటికి వస్తాడో చూద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి