తెలుగులో భారీత‌నానికి చిరునామా రాజ‌మౌళి. ఆయ‌న తీసిన య‌మ‌దొంగ‌, సింహాద్రి, మ‌గ‌ధీర‌, ఈగ సినిమాలే అందుకు నిద‌ర్శ‌నం. అలాంటి రాజ‌మౌళి ప్ర‌భాస్‌తో మ‌రో భారీ చిత్రానికి సిద్ధ‌మ‌య్యారు. ఇందులో 25 ఎక‌రాల విస్తీర్ణంలో ఓ భారీ సెట్ వేశార‌ట‌... అంతేకాదు, ఈ సినిమాకోసం 100 గుర్రాల‌ను కూడా తీసుకున్నార‌ట‌.. రాజ‌మౌళి సినిమా అంటే ఆ మాత్రం భారీత‌నం లేక‌పోతే ఎలా? ప‌్ర‌స్తుతానికిది శాంపిల్ మాత్ర‌మే. ఇలాంటివి ఆ సినిమాలో ఇంకెన్ని ఉంటాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: