ప్రపంచంలో కెల్లా అత్యధిక ధనిక దేశం ఏది అంటే అమెరికా అని చటుక్కున చెప్తారు అందరూ. టెక్నాలజీ పరంగా కానీ, మరే ఇతర రంగంలోనైనా అమెరికా ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే ప్రపంచ దేశాలలో ఉన్న నిపుణులు అందరూ అత్యధిక జీతాల కోసం అమెరికా వెళ్లాలని అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. అలాగే అక్కడికి వెళ్లి స్థిరపడిన వారు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు కూడా..అయితే..

IHG

ఇప్పుడు పరిస్థతి అంతా మారిపోయింది. కరోనా దెబ్బకి అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ సిటీ ఇప్పటిలో కోలుకునేలా లేదు. ప్రస్తుతం అమెరికాలో వినిపించేది మృత్యు భయంతో కూడిన కేకలు ఒకటైతే మరొక వైపు ఆకలి మంటల కేకలు. బహుశా ఈ పరిస్థితి అమెరికా ప్రజలు ఊహించి ఉండరు కాబోలు. అగ్ర రాజ్యంలో ఉన్నాం కదా రిస్క్ లేదనుకున్న వారందరూ ఇప్పుడు ఆకలి బాధలతో విలవిలలాడుతున్నారు..

IHG

టెక్సాస్ లోని శాన్ ఆంటోనియా ప్రాంతంలో ఉన్న ఓ ఫుడ్ బ్యాంక్ వద్దకి వచ్చిన జనాలని చూస్తే ఇది అగ్ర రాజ్యం కాదు..ఆకలి రాజ్యం అనక మానరు. సుమారు 6 వేల కుటుంభాలు తమ కార్లతో ఆ ఫుడ్ బ్యాంక్ ప్రాంతానికి వచ్చాయి. కిలోమీటర్ల పొడవున నిలిచినా వాహనాలు, బట్టర్, చీజ్, బ్రెడ్ కోసం గంటల తరబడి వేచి ఉన్న చిన్న, మధ్య తరగతి, బడా కుటుంభాలని చూసి ఫుడ్ బ్యాంక్ అధికారులు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. అయితే ప్రస్తుతం వారు ఇచ్చేవి ఈ నెలాఖరు వరకూ మాత్రమే వస్తాయని తరువాత వారి పరిస్థతి ఏమిటో తెలుచుకుంటే ఆందోళనగా ఉందని అంటున్నారు ఫుడ్ బ్యాంక్ అధికారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: