
ఇలా రష్యా యుద్ధ విమానాలు మిసైల్స్ యుద్ధ ట్యాంకులు తో తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అటు ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే యుద్ధం విరమించాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడమే కాదు దౌత్య పరమైన సంబంధాలను కూడా తెంచుకుంటూ పూర్తిగా నిషేధాన్ని విధిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాలు మాత్రమే కాదు పలు కంపెనీలు సైతం రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం.
ఇక యాపిల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ పెద్ద పెద్ద కంపెనీలు రష్యాలో అమ్మకాలు సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయ్. ఇక ఇప్పుడు ఇదే దారిలో వెళ్ళింది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ క్లిష్ట పరిస్థితినీ ఎంతో చురుకుగా పర్యవేక్షిస్తుందని ఇక రష్యాకు చీప్ ల నుంచి స్మార్ట్ ఫోన్ ల వరకు అన్నీ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక మా ఆలోచనలు ప్రభావితమైన ప్రతి ఒక్కరిలో ఉంటాయని.. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులందరి రక్షణ బాధ్యత నిర్ధారించడం మా ప్రాధాన్యత అంటూ తెలిపింది సాంసంగ్. ఈ నిర్ణయంతో అటు రష్యా కు షాక్ తగిలింది..