సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనరేషన్ కు తగ్గట్టుగా వారి పేరును పెడుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం  కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక వారి పిల్లలు జన్మించిన సమయంలో ఏదైనా ఊహించని ఘటన జరిగింది అంటే చాలు ఆ ఘటన పేరులో కలిసి వచ్చేలా చిత్రమైన నామకరణం చేయడం   లాంటివి ఇప్పటివరకు ఎన్నో చూసాము అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఒక నిండు గర్భిణి విమానంలో ప్రయాణిస్తుంది. విమానం గాల్లో ఉండగానే ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక ఆమె విమానంలోనే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇక విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆడ శిశువు పుట్టడంతో ఆ శిశువుకి ఒక విచిత్రమైన పేరు పెట్టారు. ఈ ఘటన అమెరికాకు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి ఓర్లాండో కు విమానం వెళుతుంది. షేకరియా మార్టిన్ అనే గర్భిణీ ఇందులో ప్రయాణిస్తున్నారు.


 అయితే సరిగ్గా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఆమెకు పురుటి నొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే విమాన సిబ్బందిలో ఒకరు షేకెరియ ను బాత్ రూం లోకి తీసుకెళ్లగా అందులోనే సదరు మహిళా ప్రసవించింది. ఈ క్రమంలోనే తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్లు ఎయిర్లైన్స్ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించడం గమనార్హం. ఇక మహిళ ప్రసవానికి సహకరించిన సిబ్బందిని ఎయిర్లైన్స్ సంస్థ ప్రశంసించింది. అయితే విమానం గాల్లో ఉన్నప్పుడూ జన్మించడంతో కుటుంబసభ్యులు ఆ శిశువుకు స్కై అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: