ప్రస్తుతం పెరిగి పోతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని అన్ని దేశాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పైచేయి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. భవిష్యత్తు లో ఏ దేశమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నత స్థానంలో కొనసాగుతుందో అదే ఇక ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదుగుతుంది అని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు అంచనా వేస్తున్నారు  ప్రపంచం లో ఇక ఇలా కృత్రిమ మేధస్సు తో కూడిన ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి.


 ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాను వెనక్కినెట్టి అగ్రరాజ్యంగా కొనసాగేందుకు ఎన్నో రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్న చైనా ఇక ప్రతి విషయంలో కూడా ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా చైనా ఇప్పటికే అమెరికాను దాటేసింది అంటూ అంతర్జాతీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్ హక్కుల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసుకుంది చైనానే అన్న విషయం తేలింది.


 ఇప్పటికే చైనా రోబో సోల్జర్స్ ని కనుగొని వాటిని పరీక్షించి సరిహద్దుల్లో కూడా ప్రవేశపెట్టింది అన్నది అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఒక గూఢచర్య నౌకను చైనా పసిఫిక్ మహా సముద్రంలో ప్రవేశపెట్టింది అన్నది తెలుస్తుంది. ఇలా దీనిని ఆపరేట్ చేసేందుకు ఎవరూ లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి అటు ఆర్మీ కి సమాచారం అందించబోతుందట. ఇక ఈ చర్చ నేపథ్యంలో ఇప్పటికే చైనా అమెరికాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దాటేసింది అంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఆర్టిఫిషియల్ యుద్ధ నౌక కు సంబంధించి జరుగుతున్న చర్చలో ఎంతమేరకు నిజముందో మాత్రం రానున్న రోజుల్లో నిజానిజాలు తేలిపోతాయి మరి చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: