
ఇక బ్రిటన్ లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నది తెలుస్తుంది. అక్కడ ప్రజలను ఎలుకలు వణికిస్తున్నాయి. ఎలుకలు వనికించటం ఏంటి.. అనుకుంటున్నారు కదా.. సాధారణంగా ఎలుకలు ఏ సైజులో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బ్రిటన్ లో మాత్రం ఎలుకలు ఒక చిన్న సైజు కుక్కపిల్ల లాగా మారిపోతూ ఉన్నాయి. ఏకంగా బ్రిటన్ మొత్తంలో 20 నుంచి 30 కోట్ల ఎలుకలు ఉన్నాయి అంటే ఇక అక్కడ ప్రజలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎలుకల బెడద అనేది అక్కడి ప్రజల జీవితాల్లో ఒక భాగంగానే మారిపోయింది.
దీంతో ఎలుకలను చూసి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలుకలు చావడంలేదట. అయితే ఇలా ఎలుకలు బ్రతికి ఉండడానికి కారణం.. స్థానిక ప్రజల ఆహార అలవాట్లే అన్నది తెలుస్తుంది. వారు తిని పడేసిన ఫుడ్ లోని ఫ్యాట్ తో ఎలుకలు ఏకంగా చిన్న సైజు కుక్కపిల్లల్లా మారిపోతూ ఉన్నాయి. దీంతో ఇక ఎలుకలు బెడద నుంచి తప్పించుకునేందుకు వాటిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన చావడం లేదు అన్నది తెలుస్తుంది. దీంతో ఎంతో మంది రెస్టారెంట్ నిర్వాహకులు ఎలుకల బెడద కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా బ్రిటన్ లో కనిపిస్తుంది.